జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరోలోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి
జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన hmm ఆహా
స్వరాల ఊయలూగు వేళ
Songwriters: M.M. KEERAVAANI / SIRI VENNELA SEETHA RAMASASTHRY