Brahmamokkate

తందనాన అహి,
తందనాన పురె
తందనాన భళా,
తందనాన..

బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ..🙏

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీ హరే అంతరాత్మ 🙏

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ..🙏

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ..🙏

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ..🙏

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే. 💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll Up